మ్యూచువల్ బదిలీలకు ఉత్తర్వులు ఇవ్వండి.. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి

మ్యూచువల్ బదిలీలకు ఉత్తర్వులు ఇవ్వండి.. ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి వినతి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ఎత్తేయడంతో మ్యుచువల్ బదిలీలకు వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని టీచర్ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం సచివాలయంలో వరంగల్ – ఖమ్మం – నల్గొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తొలిసారిగా  

విద్యాశాఖ కార్యదర్శి యోగితరాణాను ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుల్గం దామోదర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డి తదితరులతో కలిసి టీచర్ల సమస్యలపై వినతిపత్రం అందించారు. అప్లికేషన్ పెట్టుకొని రిటైర్డ్ అయిన టీచర్లకు, రెండోసారి మ్యూచువల్ పెట్టుకున్న వారికి, ఇంగ్లీష్ మీడియం టీచర్లను అనుమతించాలని కోరారు.