
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : ఎన్ని స్కీంలు తెచ్చినా, ఎన్ని డ్రామాలు చేసినా తెలంగాణలో కాంగ్రెస్ గెలవదని ఎమ్మెల్సీ, స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్‌ఎస్ క్యాండిడేట్ కడియం శ్రీహరి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం శివునిపల్లిలో గురువారం జరిగిన బీఆర్‌ఎస్ ముఖ్య కార్యకర్తల మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కాపీ కొట్టి కాంగ్రెస్ గ్యారంటీ స్కీమ్‌లు తెచ్చిందన్నారు.
కాంగ్రెస్‌కు క్యాండిడేట్లు కరువై ఇతర పార్టీల లీడర్లను చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 90 సీట్లకు పైగా గెలిచి మూడోసారి బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో 100 బెడ్ల హాస్పిటల్, మున్సిపాలిటీగా మార్పు, రెవెన్యూ డివిజన్ అభివృద్ధితో పాటు ఎడ్యుకేషన్ హబ్‌గా మార్చుకోవాలని సూచించారు.
ప్రజలకు సేవ చేసుకునేందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని కోరారు. రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెలిదె వెంకన్న, ఎంపీటీసీ బూర్ల లతశంకర్, మాజీ సర్పంచ్‌లు కొంతం శ్రీనివాస్, గోలి లక్ష్మి, నాయకులు పార్శి కృష్ణారావు, మారెడుపాక ఉమాశంకర్, దిడ్డి సత్యం, గుర్రం ఫాతికుమార్, వంగ శ్రీను, చిలువేరు సదానందం పాల్గొన్నారు.