కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా.. తన అనుకున్న లక్ష్యాన్ని ఎమ్మెల్సీ కవిత దైర్యంగా ముందుకు వెళ్లి సాధించి తీరుతోందని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి తెలిపారు. 33 శాతం మహిళ రిజర్వేషన్ల బిల్లు సాధన కోసం కవిత చేస్తున్న పోరాటం సఫలీకృతం అవుతుందని ఆమె ఆకాంక్షించారు.
తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ రవీంద్రభారతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యాక్రమంలో వాణీదేవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా... వివిధ రంగాల్లో రాణిస్తున్న పలువురు మహిళలను ఘనంగా సన్మానించారు. పుట్టుకతోనే ఎన్నో అవాంతరాలను అధికమిస్తూ మహిళ లోకంలో అడుగుపెడుతున్నారని... ఆటంకాలను ఎదుర్కొంటు పోరాటపటిమతో ముందుకు సాగుతుందన్నారు.