- ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి
గంగాధర, వెలుగు : సీఎం కేసీఆర్ తన తొమ్మిదేళ్ల పాలనలో దళితులను దగా చేశారని ఎమ్మెల్సీ టి.జీవన్‌రెడ్డి ఆరోపించారు. గంగాధర మండలం మధురానగర్ లోని ఓ ఫంక్షన్ హాల్లో టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. అంతకుముందు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ ఆఫీస్ నుంచి చౌరస్తాకు ర్యాలీగా వెళ్లి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ తొమ్మిదేళ్లలో దళితులకు కేటాయించిన రూ.40 వేల కోట్లు క్యారీ ఫార్వార్డ్ చేసి దళిత సమాజాన్ని కేసీఆర్ మోసం చేశారన్నారు.
ఫండ్స్ డైవర్ట్ చేస్తున్నా స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్ ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. దళితులకు ఇచ్చిన హామీలను సీఎం నెరవేర్చలేదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ సమక్షంలో సుమారు 80 మంది యువకులు పార్టీలో చేరారు. కార్యక్రమంలో వివిధ మండలాల కాంగ్రెస్ అధ్యక్షులు, యువ నాయకుడు వొడ్నాల యగ్నేశ్ తదితరులు పాల్గొన్నారు.