ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు

బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భద్రాచలం కె.కే ప్యాలస్ లో పార్టీ ఆంతరంగిక సమావేశంలో ప్రభుత్వ అధికారులను ఉద్దేశించి.. ఇష్టానుసారంగా మాట్లాడారు. ఉన్నతాధికారులైన  MRO, RDO, కలెక్టర్లను వాడు వీడు అంటూ సంబోధించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

బీఆర్ఎస్ లో గాంధీ సిస్టమ్ కాదని, బీఆర్ఎస్ జెండా పట్టుకున్న వాడికి, జెండా మోసిన వాడికే ఏ స్కీమ్ అయినా దక్కుతుందన్నారు. MRO, ఆర్డీఓ , కలెక్టర్ అయినా సరే బీఆర్ఎస్ మాట వినాల్సిందే .. ఎందుకంటే ప్రభుత్వం బీఆర్ఎస్ ది అని అన్నారు. ఎస్​ఐ అయినా, సీఐ అయినా, ఏసీపీ అయినా , చివరకు కమిషనర్ అయినా బీఆర్ఎస్ మాట వినాల్సిందే...  రాష్ట్ర ప్రభుత్వానికి అనుగుణంగా పని చేయాల్సిందే అంటూ తాతా మధు కామెంట్స్ చేశారు.