ఇంటర్ విద్య వ్యాపారమైంది: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

ఇంటర్ విద్య వ్యాపారమైంది: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

రాష్ట్రంలో ఇంటర్ విద్య వ్యాపారంగా మారిందని, ర్యాంకుల మాయలో పడి పేరెంట్స్ లక్షల రూపాయలు ధారపోస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఇంటర్ కాలేజీల్లో క్వాలిఫైడ్ లెక్చరర్లు ఉన్నప్పటికీ, విద్యార్థుల సంఖ్య తగ్గుతోందన్నారు. 

అయినా, పేరెంట్స్ ప్రైవేట్ కాలేజీలకు ఎందుకు పంపుతున్నారు? ప్రభుత్వ నిర్వహణ లోపమా? ప్రైవేట్ గుత్తాధిపత్యమా? తేలాలన్నారు. కోఠారి కమిషన్ ప్రకారం విద్యారంగానికి పదిశాతం బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రైవేట్ వ్యవస్థలను నియంత్రించాలని, ప్రభుత్వ విద్యాసంస్థలపై ప్రభుత్వాలు ఖర్చును పెంచాలని  కోరారు.