రాష్ట్రంలో రానున్నది బీసీల రాజ్యం : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

రాష్ట్రంలో రానున్నది బీసీల రాజ్యం : ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
  • ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న

కల్వకుర్తి, వెలుగు: రాష్ట్రంలో రానున్నది బీసీల రాజ్యమని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. శనివారం పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద జరిగిన తెలంగాణ బీసీ మహాసభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందన్నారు. 54 శాతం ఉన్న బీసీలు చట్టసభల్లో నలుగురు మాత్రమే ఉండడం సరైంది కాదన్నారు.

బీసీలంతా ఏకమై రాజ్యాధికారం కోసం ఉద్యమించే సమయం ఆసన్నమైందని, ఏకతాటిపైకి వచ్చి హక్కులను సాధించుకోవాలని సూచించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్  కల్పించేందుకు రాహుల్ గాంధీ సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా కాంగ్రెస్  పార్టీ కుల గణన చేసి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆర్ఎస్  ప్రవీణ్​కుమార్, ఉప్పల వెంకటేశ్, శ్రీనివాస్ యాదవ్, పల్లె రవికుమార్, ఉమ సదానందం గౌడ్, మేకల రాజేందర్, గోపాల్, వెంకటయ్య గౌడ్, రమేశ్​చారి పాల్గొన్నారు..