యాదగిరిగుట్ట, వెలుగు: ఉపాధి హామీ ఉద్యోగుల పే స్కేల్‌పై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో చర్చించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హామీ ఇచ్చారు. యాదాద్రి జిల్లా తుర్కపల్లిలో బుధవారం నిర్వహించిన మండల పరిషత్ పాలకవర్గం వీడ్కోలు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లన్నకు ఉపాధి హామీ ఉద్యోగులు వినతిపత్రం అందజేశారు.
రెండు రోజుల్లోనే డిప్యూటీ సీఎంను కలిసి పే స్కేల్ గురించి చర్చిస్తానని చెప్పారు. కార్యక్రమంలో ఉపాధి ఉద్యోగుల జేఏసీ ఇన్చార్జి చైర్మన్, టీఏపీవోస్ జనరల్ సెక్రటరీ ఎర్ర నారాయణ, స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ లింగంపల్లి నర్సయ్య, జాయింట్ సెక్రటరీ సింగమల్ల యశోద, టెక్నికల్ అసిస్టెంట్లు ఏలూరి చంద్రశేఖర్, దేవులపల్లి జ్యోతి, బండారి మాధవి, బానోతు శిరీష, భాస్కర్ నాయక్, శ్రీలత తదితరులు ఉన్నారు.