మెదక్ బీఆర్ఎస్​ ఎంపీ క్యాండిడేట్​గా వెంకట్రామ్​రెడ్డి

మెదక్ బీఆర్ఎస్​ ఎంపీ క్యాండిడేట్​గా వెంకట్రామ్​రెడ్డి

ములుగు, వెలుగు : మెదక్ బీఆర్ఎస్​ఎంపీ క్యాండిడేట్​గా ఎమ్మెల్సీ వెంకట్రామ్​ రెడ్డిని ఆ పార్టీ అధినేత కేసీఆర్ ​ప్రకటించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో శుక్రవారం పార్టీ ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో ఆయన పేరు ప్రకటించారు. సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు,  పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

ఎమ్మెల్సీ యాదవ రెడ్డి, వంటేరు ప్రతాపరెడ్డి, మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వెంకట్రామ్​రెడ్డి మాట్లాడుతూ.. ఉమ్మడి మెదక్ జిల్లాలో పదేళ్లుగా ప్రభుత్వ అధికారిగా ప్రజలతో మమేకమై పని చేశానన్నారు. అందుకే  కేసీఆర్, హరీశ్ రావు తనకు అవకాశం ఇచ్చారని తెలిపారు.