
న్యూఢిల్లీ: కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయ శాంతి బీసీ రిజర్వేషన్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీలు దేశానికి వెన్నెముకలాంటి వారు.. బీసీలకు న్యాయం జరగకపోతే దేశానికి న్యాయం జరగనట్లే అవుతుందన్నారు విజయశాంతి. బీసీ రిజర్వేషన్లకోసం ఉడుం పట్టు పట్టాల్సిన అవసరం వచ్చిందన్నారు.
బీసీ రిజర్వేషన్లను రాహుల్ గాంధీ లేవనెత్తారు..అందుకు అనుగుణంగా తెలంగాణ అసెంబ్లీలో కూడా బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేశారు. బీసీలకు న్యాయం జరిగే వరకు 42 శాతం బీసీలకు రిజర్వేషన్ల వచ్చే వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే విజయశాంతి అన్నారు.
బుధవారం (ఏప్రిల్2) ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీ పోరు గర్జన నిర్వహించారు. బీసి బిల్లుకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అయ్యేందుకు తెంలగాణ ప్రభుత్వంతో కలసి కొట్లాడేందుకు సిద్దంగా ఉన్నామని డీఎంకే,ఎన్సీపీలు ప్రకటించాయి.
తెలంగాణ, తమిళనాడు కలిసి కొట్లాడుతాం: కనిమొళి
బీసీ రిజర్వేషన్లకు తమ పార్టీ సంపూర్ణ మద్ధతు ఇస్తున్నట్లు డీఎంకే ఎంపీ కనిమొళి తెలిపారు. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మద్ధతు ఇస్తున్నామని, ఈ విషయంలో తెలంగాణకు ఎల్లవేళలా మద్ధతు ఉంటుందని అన్నారు. తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం సంతోషం.. కేంద్ర పదవుల్లో బీసీలకు ప్రాతినిధ్యం తక్కువగా ఉందని అన్నారు. అందుకోసం దేశవ్యాప్త కులగణన జరపి బీసీలకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పార్లమెంటులో బీసీ బిల్లుకు మద్ధతు ఇస్తాం: సుప్రియా సూలే
కులగణన చేసిన తొలి రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ చరిత్ర సృష్టించిందని ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే అన్నారు. ఈ సందర్భంగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్రం పార్లమెంటులో బిల్లును ఆమోదింపజేయాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. తెలంగాణ తెచ్చిన రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
►ALSO READ | వక్ఫ్ బోర్డు బిల్లును.. లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. బిల్లు ఆమోదం పొందాలంటే..