Kalki 2: కల్కి 2కి మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్.. మేకర్స్ ఏమంటున్నారు?

Kalki 2: కల్కి 2కి మ్యూజిక్ డైరెక్టర్ చేంజ్.. మేకర్స్ ఏమంటున్నారు?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కల్కి 2898 ఏడీ. దాదాపు రూ.600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించాడు. భారీ అంచనాల మధ్య జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని సాధించింది. కేవలం మూడు రోజుల్లోనే రూ.415 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. రానున్న రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశముంది అంటున్నారు ట్రేడ్ వర్గాలు. 

ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా ఉంటుందని మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సీక్వెల్ షూట్ కూడా ఇప్పటికే అరవై శాతం పూర్తయ్యిందని మేకర్స్ చెప్పడంతో.. ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. దాంతో కల్కి సినిమా సీక్వెల్ పై రకరాకాల కథనాలు వైరల్ అవుతున్నాయి. ఈ నేపధ్యంలోనే కల్కి సీక్వెల్ పై మరో న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అదేంటంటే.. కల్కి 2898 ఏడీ సినిమా విషయంలో మ్యూజిక్ పై ఆడియన్స్ నుండి కాస్త నెగిటీవ్ కామెంట్స్ వినిపించాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇంకాస్త ఇంపాక్ట్ ఫుల్ గా ఉండుంటే సినిమా రేంజ్ నెక్స్ట్ లెవల్లో ఉండేదని కామెంట్స్ వినిపించాయి. దాంతో.. కల్కి సీక్వెల్ కోసం ఆ విషయంలో మార్పు చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యారట. అందుకే.. కల్కి 2 కోసం సంతోష్ నారాయణన్ కాకుండా ఆయన స్థానాల్లో ఎంఎం కీరవాణికి అవకాశం ఇవ్వనున్నారట.

కారణం ఏంటంటే.. కల్కి సినిమాను మహాభారతానికి లింక్ చేస్తూ సెటప్ చేసుకున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. కల్కి పార్ట్ 2లో మహాభారతం పార్ట్ ఇంకాస్త ఎక్కువ ఉండే అవకాశం ఉంది. కాబట్టి.. ట్రెడిషనల్ మ్యూజిక్ ఇవ్వడంలో కీరవాణి దిట్ట. అందుకే.. కల్కి పార్ట్ 2 కోసం ఆయన్ని తీసుకోనున్నారట మేకర్స్. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మరి.. ఎంఎం కీరవాణి రాకతో కల్కి సినిమా రేంజ్ పెరుగుతుందా చూడాలి.