ఎమ్మెల్యే కాన్వాయ్​ను అడ్డుకున్న ఎమ్మార్పీఎస్​

కథలాపూర్, వెలుగు:  కథలాపూర్​ మండల పర్యటనకు వచ్చిన వేములవాడ ఎమ్మెల్యే రమేశ్​బాబు కాన్వాయ్‌ను ఎమ్మార్పీఎస్​ లీడర్లు అడ్డుకున్నారు. సోమవారం మండలంలోని చింతకుంటలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు జడ్పీ చైర్మన్​వసంతతో  కలిసి ఎమ్మెల్యే బయలుదేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాన్వాయ్  ‌‌ ‌‌ను ఎమ్మార్పీఎస్​ లీడర్లు అడ్డుకున్నారు. వారు మాట్లాడుతూ తక్కలపల్లిలో నెల కింద దళిత యువకుడు అనుమానాస్పదంగా చనిపోతే, బాధిత కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని మృతిపై వాస్తవాలు కూడా తేల్చలేదని ఆరోపించారు.  చింతకుంటలో అంబేడ్కర్​ విగ్రహం గద్దెకు బీఆర్​ఎస్​ జెండాలు కట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనకారులను సీఐ ప్రవీణ్​కుమార్​, ఎస్సై శ్వేత , సిబ్బంది పక్కకు లాక్కెళ్లారు.