కోటగిరి, వెలుగు: నవంబర్ 5 న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద నిర్వహించే మాదిగల యుద్ధభేరి మహాసభను విజయవంతం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు కోరారు. కోటగిరిలోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద కార్యక్రమ పోస్టర్లను ఎమ్మార్పీఎస్ లీడర్లు ఆవిష్కరించారు.
బాన్సువాడ డివిజన్ ఇన్చార్జి నాగేశ్మాట్లాడుతూ..తెలంగాణలో అన్ని రాజకీయ పార్టీలు మాదిగలకు 23 ఎమ్మెల్యే సీట్లు కేటాయించాలని, మాదిగ డిక్లరేషన్ ప్రకటించాలని, డప్పుచప్పుళ్ల కళాకారులకు రూ.4000 ఫించన్ఇవ్వాలని డిమాండ్చేశారు. ఎమ్మార్పీఎస్ కోటగిరి మండలాధ్యక్షుడు సాయిలు, ఉపాధ్యక్షుడు శ్రీను, సభ్యులు సాయిలు, దినేశ్, శ్రీకాంత్, నవీన్, కృష్ణ పాల్గొన్నారు.