సికింద్రాబాద్, వెలుగు: నిత్యం రద్దీగా ఉంటున్న మేడ్చల్, లింగంపల్లి, తెల్లాపూర్ మార్గాల్లో ఎంఎంటీఎస్ రైలు సర్వీసులను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం గ్రేటర్వ్యాప్తంగా 80 సర్వీసులు నడుస్తున్నాయి. మేడ్చల్మార్గంలో ఒకే సర్వీస్ అందుబాటులో ఉంది.
బుధవారం నుంచి మూడు సర్వీసులను ప్రారంభించారు. తెల్లాపూర్వరకు మరికొన్ని పెంచినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఫలక్నుమా, లింగంపల్లి మార్గంలో నడిచే రైళ్ల టైమింగ్స్మార్పుతో ఐటీ కారిడార్లో పనిచేసే ఉద్యోగులకు, శివారు ప్రాంతాల వారికి జర్నీ మరింత సౌకర్యవంతంగా మారనుంది.