- ..అమలులోకి వచ్చిన కొత్త టైం టేబుల్
సికింద్రాబాద్, వెలుగు: గ్రేటర్‌పరిధిలో తిరిగే ఎంఎంటీఎస్ రైళ్ల టైమింగ్స్మారాయి. దక్షిణ మధ్య రైల్వే అధికారులు బుధవారం నుంచి కొత్త టైం టేబుల్‌ను అమలులోకి తెచ్చారు. ప్రస్తుతం నడుస్తున్న 88 సర్వీసులు మారిన టైమింగ్స్ప్రకారం అందుబాటులో ఉంటాయని తెలిపారు. వందేభారత్ రైళ్లను అను సంధానం చేయడం కోసం టైమింగ్స్మార్చినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు మార్పులను గమనించాలని, నేషనల్ ట్రైన్ ఎం క్వైరీ సిస్టమ్ లో పూర్తి వివరాలు ఉన్నాయని చెప్పారు.