![ఎంఎంటీఎస్ రైళ్లు రెడీ ..రైల్వే శాఖ పర్మిషన్ కోసం వెయిటింగ్](https://static.v6velugu.com/uploads/2020/10/mmts-1.jpg)
సికింద్రాబాద్, వెలుగు : కరోనా ఎఫెక్ట్ తో ఆరు నెలలుగా వర్క్ షాప్ కే పరిమితమైన ఎంఎంటీఎస్ రైళ్లు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను అధికారులు చకచకా చేస్తున్నారు. ఇప్పటికే మెట్రో, సిటీ బస్సులు పబ్లిక్కి అందుబాటులోకి రావటంతో ఎంఎంటీఎస్ ను రైళ్లనూ నడపాలని స్థానిక రైల్వే అధికారులు భావిస్తున్నారు. రైల్వే శాఖ నుంచి పర్మిషన్ రావడమే ఆలస్యం.. ట్రైన్స్ నడిపేలా రిపేర్లు చేశారు. సిటిజన్స్ కూడా ఎంఎంటీఎస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఆ సర్వీసులు అందుబాటులోకి వస్తే ప్రయాణ ఖర్చులు తగ్గుతాయని ప్రైవేట్ఎంప్లాయ్స్, చిరు వ్యాపారులు, మిడిల్క్లాస్ పీపుల్ఎదురుచూస్తున్నారు. లాక్ డౌన్కి ముందు సికింద్రాబాద్– లింగంపల్లి, హైదరాబాద్– లింగంపల్లి, ఫలక్నుమా– హైదరాబాద్రూట్లలో 121 ట్రిప్పులతో డైలీ లక్షా70 వేల మంది ప్రయాణికులను ఎంఎంటీఎస్ రైళ్లు గమ్యస్థానానికి చేర్చేవి. ఆరు నెలలుగా నిలిచిపోవడంతో రైల్వే శాఖ కూడా డైలీ రూ.10 లక్షల ఆదాయం కోల్పోతోంది.
ఫేజ్ –2 ట్రయల్ రన్
ఎంఎంటీఎస్ బోగీలు, ఇంజిన్, వీల్స్, ఇతర మెషినరీని పూర్తిస్థాయిలో రిపేర్ చేశారు. బ్యాటరీలు, బ్రేకులు, వీల్ అలైన్మెంట్లు చెక్ చేసి పెట్టారు. మౌలాలిలోని ఎలక్ర్టికల్మల్టీపుల్ యూనిట్లో ఎంఎంటీఎస్ రైళ్లను ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తున్నారు. మరోవైపు ఎంఎంటీఎస్ ఫేజ్–-2లో భాగమైన సికింద్రాబాద్– మల్కాజ్గిరి, మేడ్చల్-– మౌలాలి రూట్లలో ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు.