
సికింద్రాబాద్, వెలుగు: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల నేపథ్యంలో బుధవారం పలు ఎంఎంటీఎస్సర్వీసులను రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మేడ్చల్–హైదరాబాద్–మేడ్చల్, ఫలక్నుమా-సికింద్రాబాద్– ఫలక్నుమా, సికింద్రాబాద్–మేడ్చల్– సికింద్రాబాద్ రూట్లలో ఆరు ఎంఎంటీఎస్సర్వీసులను రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ప్రత్యామ్నాయం చూసుకోవాలని సూచించారు.