హైదరాబాద్, వెలుగు:ఆన్లైన్ క్లాసులైనా, హాలిడేస్ అయినా ఎక్కువ శాతం స్టూడెంట్స్ ఫోన్‌తోనే టైం స్పెండ్ చేస్తున్నారు. గంటలు గంటలు ఫోన్‌చూస్తూ.. రాత్రిళ్లు లేటుగా నిద్రపోతున్నారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులకు రోజురోజుకి టెన్షన్ పెరిగిపోతుంది. ఫోన్ ఎక్కువగా వాడొద్దని, చదువుకోమని గట్టిగా చెప్తే చిన్నారులు ఫ్రస్టేట్అవుతున్నారు. అలగడం, తలను, చేతులను గోడకేసి కొట్టుకోవడం, ఇంట్లో నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోవడం వంటివి చేస్తున్నారు. ఏం చేయాలో తెలియక పేరెంట్స్మానసిక నిపుణులను సంప్రదిస్తున్నారు. ఈ మధ్య కాలంలో సెల్ఫ్ హార్మ్ చేసుకుంటామని పిల్లలు పేరెంట్స్ ని బెదిరిస్తున్న కేసులు పెరిగా యని సైకియాట్రిస్ట్‌లు చెప్తున్నారు.
వారిస్తే..వాదిస్తున్నారు
ఒకప్పుడు స్కూలుకి వెళ్లాలి కాబట్టి పిల్లలు డైలీ హోంవర్క్చేసేవారు. ఎవరిలోనూ తక్కువ కాకూడదని పోటీపడి చదివేవారు. ఆన్లైన్క్లాసులు స్టార్ట్అయ్యాక పిల్లలు చదువులను పెద్దగా కేర్చేయట్లేదు. ఆన్లైన్ క్లాసుల కోసం పేరెంట్స్మొబైల్ఇస్తుండగా, పిల్లలు స్టడీస్‌పై కాకుండా ఇతర విషయాలపై ఫోకస్ పెడుతున్నారు. క్లాసులు కంప్లీట్అవ్వగానే సోషల్ యాప్స్‌లో చాటింగ్స్, వీడియో కాల్స్, ఆన్లైన్ గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు. వద్దని పేరెంట్స్ వారిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ఫోన్ లాక్కుంటే రూమ్‌లోకి వెళ్లి తలను, చేతులను గోడకేసి కొట్టుకుంటున్నారు. వారి చేష్టలను చూసి భయపడిపోతున్న తల్లిదండ్రులు సైకియాట్రిస్టులను కాంటాక్ట్ అవుతున్నారు. కొంతమంది పిల్లలు ఇంట్లోని పెద్దవాళ్లను హేళన చేయడం, వాళ్లని ఏడిపిస్తూ, ఆటపట్టిస్తూ ఆనందం పొందుతున్నారని సైకియాట్రిస్ట్
డా.అనిత తెలిపారు.
ముందు పేరెంట్స్‌తో మాట్లాడి..
ప్రస్తుతం పిల్లల్లో పెరుగుతున్న ఈ రకమైన లక్షణాలతో మానసిక నిపుణులను సంప్రదిస్తున్న తల్లిదండ్రుల సంఖ్య పెరుగుతోంది. ఒక్కో సైకియాట్రిస్ట్‌కి పదుల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సైకియాట్రిస్ట్‌లు నేరుగా కంటే ఆన్లైన్లో కేసులను తీసుకుంటున్నారు. పిల్లలు ఆరేళ్ల పైబడి ఉంటే ముందు పేరెంట్స్ తో మాట్లాడి ఆ తర్వాత జూమ్, వాట్సాప్ వీడియో కాల్స్ ద్వారా పిల్లలతో ఇంటరాక్ట్ అవుతున్నారు. 90 శాతం పేరెంట్స్ తో మాట్లాడుతూ ఎలా ఉండాలో, ఏం మార్పులు చేయాలో సూచిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేరుగా పిల్లలతో మాట్లాడుతున్నారు. కౌన్సెలింగ్ సెషన్ సమయంలో పిల్లలతో సరదాగా మాట్లాడుతూ వాళ్ల ఇష్టాయిష్టాలు తెలుసుకోవడంతో పాటు ప్రస్తుతం అకడమిక్ ఇయర్ లో ఎలా చదువుతున్నావని, ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టమని తెలుసుకుంటున్నారు. ఎలా ఉండాలో, హెల్త్‌ని ఎలా చూసుకోవాలో, డే షెడ్యూల్ ఎలా ప్లాన్ చేసుకోవాలో సూచిస్తున్నారు.
పేరెంట్స్ ఫ్రెండ్లీగా మెలగాలి
ఆన్లైన్ క్లాసులు కారణంగా మొబైల్ అడిక్షన్ పెరిగిపోయింది. పిల్లలు ఫోన్ ని మిస్ యూజ్ చేస్తున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తెలియని వారితో పరిచయాలు, అర్ధరాత్రి వరకు ఫోన్లు, చాటింగ్స్‌తో గడుపుతున్నారు. ఆ ఎఫెక్ట్స్టడీస్ మీద పడుతోంది. నా దగ్గరకు వచ్చే కేసుల్లో ఎక్కువగా 14 నుంచి18 ఏళ్ల పిల్లలే ఉంటున్నారు. పేరెంట్స్ నేరుగా మమ్మల్ని సంప్రదించకుండా వేరే డాక్టర్లను అప్రోచ్ అవుతున్నారు. వారి రిఫరెన్స్ ద్వారా మా దగ్గరకు వస్తున్నారు. మేం పిల్లలతో మాట్లాడుతూ ఆల్టర్నేట్ యాక్టివిటీస్, ఎక్సర్‌సైజ్, యోగ, మెడిటేషన్ వంటివి సూచిస్తున్నాం. పేరెంట్స్ ఫ్రెండ్లీ బిహేవియర్ తో ఉండాలని చెప్తున్నాం.
- డా.మేజర్ అలీ,
సైకియాట్రిస్ట్, బంజారాహిల్స్
పెద్దల భయమే పిల్లలకు అలుసు
సోషల్ మీడియాలో వస్తున్న జోక్స్, మీమ్స్‌ని ఇంట్లో వాళ్ల మీద చూపిస్తున్నారు పిల్లలు. పేరెంట్స్ కోపంగా ఉంటే వారిని అను కరిస్తూ అగ్రెస్సివ్ గా తయారవుతున్నారు. కోపంతో ఒక మాట అంటే వెంటనే తమను తాము హార్మ్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తల్లిదండ్రులు భయపడుతుండటంతో పిల్లలకు లీనియెన్స్ పెరిగిపోతోంది. ఏదైనా చేయొద్దని చెప్తే వాదిస్తూ పేరెంట్స్ ని భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. పిల్లలు పేరెంట్స్ ని భయపెట్టేందుకు సూసైడ్, సెల్ఫ్ హార్మ్ విధానాలను ఈజీ టూల్స్ గా వాడుకుంటున్నారు. ప్రస్తుతం నాకు ఇలాంటివి వారానికి 10 కేసులు వస్తున్నాయి.
- డా.అనిత ఆరే, సైకియాట్రిస్ట్, నిజాంపేట్