ఇక నుండి మన దేశంలో ఫోన్లో ఇంటర్నెట్ లేకున్నా, ఫోన్‌తో క్యూఆర్ కోడ్ స్కాన్ చేయకపోయినా యుపిఐ ఐడీ నుండి పేమెంట్స్ చేసుకోవచ్చు. ఆర్బిఐ రీసెంట్గా లాంచ్ చేసిన ‘యుపిఐ123పే’ ద్వారా ఒక్క మిస్డ్‌కాల్ చేసి యుపిఐ పేమెంట్ చేయొచ్చు. ఈ సిస్టమ్‌ను ఫీచర్ ఫోన్స్ వాడేవాళ్ల కోసం తీసుకొస్తున్నారు. ఇప్పటికీ దేశంలో 40 కోట్ల మందికి పైగా ఫీచర్ ఫోన్లను వాడుతున్నారు. వాళ్లందరూ స్కాన్ చేసి ఆన్లైన్ పేమెంట్స్ చేయలేరు కదా. అందుకే ఈ సిస్టమ్‌ను కూడా తెస్తోంది ఆర్బిఐ. యుపిఐ123పే ఎలా పనిచేస్తుందంటే మొదట మర్చంట్ అకౌంట్ ఇచ్చిన మొబైల్ నెంబర్‌కు ఒక మిస్డ్ కాల్ ఇస్తే చాలు. ఐవిఆర్(ఇంటెరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్) నుండి ఫోన్ కాల్ వస్తుంది. దాంట్లో ఎవరికి డబ్బులు పంపాలి? ఎంత పంపాలి? అని అడుగుతారు. తరువాత యుపిఐ పిన్ ఎంటర్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అన్ని రకాల బిల్ పేమెంట్స్, రీచార్జ్ చేసుకునే సదుపాయం ఉంది. అకౌంట్ బ్యాలెన్స్ కూడా చెక్ చేసుకొవచ్చు. ఇవన్నీ చేయాలంటే మొబైల్ నెంబర్‌తో బ్యాంక్ యుపిఐ ఐడి లింక్ చేసి ఉండాలి. ఎన్పిసిఐ( నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా), యుపిఐ123పే కంప్లైంట్స్ కోసం 24/7 హెల్ప్ లైన్ ఉంది.
టోల్‌ఫ్రీ నెంబర్లలో 14431, 180089 13333 లేదా www. digisaathi.info వెబ్ సైట్లో కాంటాక్ట్ చేయొచ్చు.