
- ప్రకటించిన కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: 2025 ఆర్థిక సంవత్సరంలో మొబైల్ ఫోన్ ఎగుమతుల విలువ రూ. రెండు లక్షల కోట్లు దాటిందని కేంద్ర టెలికం, కమ్యూనికేషన్ల శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ అన్నారు. ఈసారి ఐఫోన్ షిప్మెంట్లు కూడా భారీగా ఉన్నాయని, వాటి విలువే రూ.1.5 లక్షల కోట్లు ఉందని వివరించారు. 2023–-24 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే స్మార్ట్‌ఫోన్ ఎగుమతులు 54 శాతం వృద్ధిని సాధించాయని మంత్రి తెలిపారు.
మన దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ గత 10 సంవత్సరాలలో ఐదు రెట్లు పెరిగిందని, ఎగుమతులు ఆరు రెట్లు పెరిగాయని ఆయన అన్నారు. పాసివ్ కాంపోనెంట్ పథకం కోసం ప్రభుత్వం డ్రాఫ్ట్ నోటిఫికేషన్‌ను జారీ చేస్తోందని, దీనిపై దాదాపు రెండు వారాల పాటు సంప్రదింపులు జరుగుతాయని మంత్రి ప్రకటించారు.