పదవ తరగతిలో పదికి పది సాధించిన ప్రతి విద్యార్థికి మొబైల్ ఫోన్ : కలెక్టర్ బాదావత్ సంతోష్

పదవ తరగతిలో  పదికి పది సాధించిన ప్రతి విద్యార్థికి మొబైల్ ఫోన్ : కలెక్టర్ బాదావత్ సంతోష్
  • నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ 

 కొల్లాపూర్, వెలుగు : పదో తరగతిలో 10/10    మార్కులు సాధించే విద్యార్థులకు మొబైల్ ఫోన్ బహుమతిగా అందజేస్తానని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్  అన్నారు.గురువారం  కొల్లాపూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి  మధ్యాహ్న భోజనం చేశారు.   విద్యార్థుల కోసం ప్రతిరోజూ రుచికరమైన , పోషకమైన భోజనం అందించాల్సిందిగా వంట సిబ్బందికి సూచించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడారు.   విద్యార్థులను ప్రోత్సహించడమే కాకుండా, వారి భవిష్యత్  కు ఉపాధ్యాయులు  గైడ్​ చేయాలని సూచించారు.   

గత సంవత్సరం పదో తరగతి విద్యార్థుల ఉత్తీర్ణత శాతం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల విజయం కోసం మరింత మెరుగైన వసతులు కల్పించడంపై చర్చ జరిపిన కలెక్టర్, పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలను పరిశీలించారు. ఆయనతోపాటు  కలెక్టర్ వెంట ఆర్డీఓ బన్సీలాల్ తహసీల్దార్ విష్ణువర్ధన్ రావు, పాఠశాల ఉపాధ్యాయులు అన్నపూర్ణ ,రాజేందర్, పీఈటీ సుప్రియ తదితరులు ఉన్నారు.