తెలంగాణ రాష్ట్రంలో ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్మీడియేట్ పరీక్షలు జరిగాయి. ఇప్పటికే ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. ఈ ప్రక్రియను ఇంటర్ బోర్డు మరింత కట్టుదిట్టంగా నిర్వహిస్తోంది. మూల్యాంకన కేంద్రాల్లో విధులకు హాజరయ్యే అధ్యాపకుల ఫోన్లను అనుమతించకూడదని ఇంటర్ బోర్డు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది. కేంద్రాల్లోకి గతంలో ఫోన్లను అనుమతించడం వల్ల సమస్యలు తలెత్తాయని, ఆ సమస్యలు పునరావృతంకాకుండా వెంటనే స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాల్లోకి ప్రవేశించే ముందు అధ్యాపకులు తమ ఫోన్లను సెక్యురిటీ గార్డులకు డిపాజిట్ చేయాలని బోర్డు సూచించింది. అలాగే పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం చేసే గదుల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.
Also Read: ఇవి తింటే మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి
ఒక్కో అధ్యాపకుడు ఉదయం 15 పేపర్లు, సాయంత్రం 15 పేపర్లు చొప్పున.. రోజుకు కేవలం 30 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇస్తున్నట్లు అధికారులు తెలిపారు. లెక్చరర్లు గదిని దాటి బయటకు వచ్చిన ప్రతిసారీ రిజిస్టర్‌లో నమోదు చేయాలని బోర్డు స్పష్టం చేసింది. విద్యార్థుల సమాధాన పత్రాల కోడింగ్ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహిస్తున్నామని, అక్రమాలకు తావులేకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 10 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల మూల్యాంకనం కోసం రాష్ట్రవ్యాప్తంగా 16 కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొత్తం 60 లక్షల పేపర్లు మూల్యాంకన కేంద్రాలకు చేరుకున్నాయి. వీటిని మూల్యాంకనం చేసేందుకు సబ్జెక్టుల వారీగా 20 వేల మంది అధ్యాపకులు ఈ ప్రక్రియలో నిమగ్నమయ్యారు.
telangana, inter paper valuation, telgulatestnews,v6news, inter board is more strict,Ts inter students,