ఈ–వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించేందుకు సెలెక్ట్ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఈ–వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించేందుకు సెలెక్ట్ మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ : కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఎలక్ట్రానిక్స్ వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తగ్గించేందుకు  మొబైల్ రిటైల్ చెయిన్ సెలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ‘మిషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఈ–వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఇనీషియేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను ప్రారంభించింది. దీన్ని రాష్ట్ర  పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ చేశారు. ఈ ఇనీషియేటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో భాగంగా ప్రజలు తమ దగ్గర ఉన్న ఈ–వేస్ట్ అంటే పాత ఫోన్లు, ఛార్జర్లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వంటివి సెలెక్ట్ స్టోర్లకు వెళ్లి ఇవ్వొచ్చు. వీరిచ్చిన ఈ–వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు బదులుగా రూ.1,000 నుంచి రూ.10,000  వరకు గల విలువైన వోచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సంస్థ తిరిగి ఇస్తుంది.

సెలెక్ట్ స్టోర్లలో మొబైల్ ఫోన్లు,స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, ల్యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు వంటివి కొనుగోలు చేసుకోవడానికి వీటిని వాడుకోవచ్చు. ఈ–వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేయడం పెద్ద ఛాలెంజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా మారిందని  కేటీఆర్ అన్నారు. సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్టులు, టెంపుల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌,ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో ఇలాంటి విధానాన్ని అమలు చేయాలని చూస్తున్నామని చెప్పారు.  పర్మిషన్ ఇస్తే  సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  దగ్గర ఈ–వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కలెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తామని, క్యూఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పెడతామని,  ఈ–వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేసిన వారు ఈ క్యూఆర్ కోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను స్కాన్ చేసి వోచర్ పొందొచ్చని సెలెక్ట్ ఎండీ వై గురు అన్నారు.

తమ స్టోర్ల దగ్గర సేకరించిన ఈ–వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పర్యావరణానికి హాని చేయని విధానంలో రీసైకిల్ చేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఇండియాలో ఏడాదికి 18–20 లక్షల మెట్రిక్ టన్నుల ఈ వేస్ట్ పుట్టుకొస్తోందని, ఇందులో 20 శాతం కూడా డిస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోజ్ కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ‘మిషన్ ఈ–వేస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌’ ఆగస్టు 15 నుంచి అమలు చేస్తామని చెప్పారు.