గుట్ట ఆలయంలోకి సెల్​ఫోన్లు తేవొద్దు: ఈవో భాస్కర్ రావు

యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట ఆలయంలోకి డ్యూటీలు చేసే సిబ్బంది తమ సెల్​ఫోన్లను తేవడాన్ని నిషేధిస్తూ ఈవో భాస్కర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టులతో పాటు ప్రధానాలయంలో డ్యూటీ చేసే మినిస్టీరియల్ సిబ్బంది, మతపర సిబ్బంది, నాలుగో తరగతి సిబ్బంది, ఎస్పీఎఫ్ పోలీసులు, హోంగార్డులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది కూడా సెల్​ఫోన్లు తీసుకురావొద్దని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఆదేశాలు మంగళవారం నుండే అమల్లోకి వస్తాయని చెప్పారు.