ఆస్పత్రిలో రోగి బంధువుల సెల్ ఫోన్లు చోరీ

వరంగల్ అర్బన్: పేద రోగులకు వైద్యం చేసి స్వస్థత చేకూర్చే వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి కొన్ని రోజులుగా చిల్లర దొంగతనాలకు కేరాఫ్  అడ్రస్ గా మారుతోంది. అదమరచి ఉంటే అంతే సంగతులు అన్నట్లు దుండగులు హస్తలాఘవం ప్రదర్శిస్తున్నారు. నిన్న ఒకే రోజు రోగి  బంధువులకు చెందిన నాలుగు సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. చేతివాటం ప్రదర్శిస్తున్న వారే అడిగేవాడు లేడన్నట్లు రెచ్చిపోతుండడంపై రోగుల బంధువులు లబోదిబోమంటున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదని..కష్టపడి కొన్న ఖరీదైన మొబైల్ ఫోన్లు తిరిగి కొనేంత స్థోమత తమకు లేదని.. బాధితులు వాపోయారు. ఈ మేరకు ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ కు రోగి బంధువులు ఫిర్యాదు చేశారు.