నిజామాబాద్ క్రైమ్, వెలుగు: పోగొట్టుకున్న మొబైల్‌ను సియర్ పోర్టల్ ద్వారా ట్రేస్చేసి పోలీసులు 24 గంటల్లో బాధితుడికి అందజేశారు. ఈ నెల18 న సాయంత్రం నగరంలోని హమాల్ వాడి ప్రాంతంలో ఖానాపూర్ కి చెందిన గండ్ల రాజు సెల్ఫోన్పోయింది. వెంటనే బాధితుడు www.ceir.gov.in వెబ్సైట్లోకి వెళ్లి ఫోన్‌నంబర్, పూర్తి వివరాలు అప్‌లోడ్‌చేశారు. దీంతో 24 గంటల వ్యవధిలో పోలీసులు రికవరీ చేయగా బుధవారం ఇన్చార్జి సీపీ ప్రవీణ్ కుమార్ బాధితుడు రాజకు మొబైల్ అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ఎవరైనా మొబైల్స్పోగొట్టుకుంటే వెంటనే ‘సియర్’ పోర్టల్ ఓపెన్‌చేసి మొబైల్నంబర్, వివరాలు పొందపర్చాలని చెప్పారు. డీసీపీ గిరిరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మధుసూదన్‌రావు, నిజామాబాద్ ఏసీపీ ఎమ్. కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.