బషీర్ బాగ్, వెలుగు : గ్రూప్ – 1 ఎగ్జామ్ సెంటర్ వద్ద మొబైల్ టాయిలెట్ బస్సు బీభత్సం సృష్టించింది. డ్రైవర్ నిర్లక్ష్యంతో నాంపల్లిలోని ఇందిరా ప్రియదర్శిని మహిళా కాలేజీ ఎంట్రెన్స్ గేటు కూలింది. కాలేజీలో సోమవారం గ్రూప్ 1 మెయిన్స్పరీక్షల నేపథ్యంలో మహిళ అభ్యర్థుల కోసం జీహెచ్ఎంసీ మొబైల్ టాయిలెట్ బస్సును తీసుకొచ్చారు.
రివర్స్ చేసున్న సమయంలో వెనుక వైపు చూడకుండా డ్రైవర్ అజాగ్రత్తగా బస్సును నడిపాడు. దీంతో కాలేజీ ప్రహరీ గేటు, గోడను బస్సు ఢీ కొనడంతో ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కాలేజీ ప్రిన్సిపాల్‌తో జీహెచ్ఎంసీ అధికారి మాట్లాడి, గేటు. గోడకు మరమ్మత్తులు చేయిస్తామని తెలపడంతో ఎలాంటి కేసులు నమోదు కాలేదు.