కామారెడ్డి టౌన్, వెలుగు: ఎన్నికల కోడ్అమలుపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని కామారెడ్డి కలెక్టర్ జితేశ్వి పాటిల్ పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో ఆఫీసర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్‌ను ఎవరైనా ఉల్లంఘిస్తే టోల్‌ఫ్రీ నంబరు1950, జిల్లా ఎన్నికల కంట్రోల్ రూమ్‌నెంబర్ 08468 223060కు కాల్చేసి సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై సంబంధిత ఆఫీసర్లు అలర్ట్‌గా ఉండాలన్నారు.
కలెక్టరేట్లోని కంట్రోల్‌రూమ్ రౌండ్‌ది క్లాక్ గా పని చేస్తోందన్నారు. ఆయా పార్టీలు సభల కోసం తప్పనిసరి పర్మిషన్ తీసుకోవాలన్నారు. ఎస్పీ సింధూశర్మ, అడిషనల్ కలెక్టర్ చంద్రమోహన్, నోడల్ ఆఫీసర్లు కిషన్, సురేందర్‌కుమార్, శాంతికుమార్, సతీష్‌యాదవ్, శ్రీధర్‌రెడ్డి పాల్గొన్నారు.