మోడల్ స్కూల్​ అడ్మిషన్ల​ షెడ్యూల్ విడుదల

మోడల్ స్కూల్​ అడ్మిషన్ల​ షెడ్యూల్ విడుదల

రాష్ర్టంలోని మోడల్​స్కూళ్లలో 2020–21 విద్యాసంవత్సరానికి గాను మంగళవారం అడ్మిషన్ నోటిఫికేషన్​జారీకానున్నది. ఆరో తరగతితో పాటు సెవెన్త్ నుంచి టెన్త్​వరకూ ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు అడ్మిషన్​షెడ్యూల్​ను స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ అడిషనల్​డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి సోమవారం విడుదల చేశారు. ఆన్​లైన్​పేమెంట్స్​ను ఆరో తరగతికి ఫిబ్రవరి3 నుంచి 29 వరకూ, సెవెన్త్​నుంచి పదో తరగతి వరకూ ఫిబ్రవరి 7 నుంచి మార్చి 2 వరకూ తీసుకోనున్నారు. ఆరో తరగతికి ఫిబ్రవరి 4 నుంచి 29 వరకూ, ఏడో తరగతి నుంచి పదో తరగతి వరకూ ఫిబ్రవరి 8 నుంచి మార్చి 2 వరకూ ఆన్​లైన్​లో అప్లికేషన్స్​ను స్వీకరించనున్నారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఏప్రిల్12న ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఉదయం10 నుంచి మధ్యాహ్నం12 వరకూ ఆరో తరగతి ఎంట్రెన్స్​కు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4  వరకు ఏడు నుంచి పదో తరగతి అడ్మిషన్ల కోసం ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్ 9 నుంచి హాల్​టికెట్లు డౌన్​లోడ్ చేసుకోవచ్చు. మే 5న ఫలితాలను విడుదల చేయనున్నారు. మే 27న సెలెక్షన్​లిస్టు విడుదల చేసి, మే 28 నుంచి31 వరకూ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ఉంటుంది.