ఏప్రిల్ 27న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్

ఏప్రిల్ 27న మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఈ నెల 27న అడ్మిషన్ టెస్టు నిర్వహిస్తున్నట్టు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ శ్రీనివాస్​చారి తెలిపారు. ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం12 గంటల వరకు ఆరో తరగతి అడ్మిషన్ల కోసం, ఏడు నుంచి టెన్త్ వరకు ఖాళీగా ఉన్న సీట్ల కోసం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎగ్జామ్ ఉంటుందని చెప్పారు. 

అన్ని జిల్లా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అయితే, ఈ అడ్మిషన్ టెస్టు కోసం మొత్తంగా 40,332 అప్లికేషన్లు వచ్చాయని పేర్కొన్నారు. ఆరో తరగతి సీట్ల కోసం 23,945 మంది, ఏడో తరగతికి 6,793 మంది, 8వ తరగతి సీట్ల కోసం 5,249, నైన్త్ క్లాస్​ కోసం 3,436, టెన్త్ క్లాస్​ కోసం 909 మంది అప్లై చేసుకున్నారని వివరించారు.