కొత్తపల్లి, వెలుగు : హైదరాబాద్ మెలూహ ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 24వరకు నిర్వహించిన మోడల్ యునైటెడ్ నేషన్స్-–-2023లో తమ స్టూడెంట్స్ అవార్డులు సాధించినట్లు పద్మనగర్ పారమిత హెరిటేజ్ స్కూల్ చైర్మన్ డాక్టర్ ఇ.ప్రసాదరావు తెలిపారు. దేశంలోని 30 స్కూళ్ల నుంచి 300 మంది విద్యార్థి ప్రతినిధులు పాల్గొనగా ఆర్.శైలేందర్ లోక్‌సభ ఉత్తమ ప్రతినిధిగా
విహాన్ కబ్రా యూఎన్ ఉత్తమ ప్రతినిధిగా, వి.రిత్విక్ తజకిస్థాన్ ఉత్తమ ప్రతినిధిగాఅవార్డులు పొందినట్లు వివరించారు. ఈ సందర్భంగా సోమవారం విద్యార్థులను చైర్మన్ అభినందించారు. డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్‌రావు, రాకేశ్, వీయూఎం ప్రసాద్, వినోద్‌రావు, హన్మంతరావు, హెచ్‌ఎం రితేష్ మెహతా, ప్రోగ్రాం హెడ్ గోపీకృష్ణ, గైడ్ టీచర్స్ శివరామకృష్ణ, శ్రేయ బెనర్జీ పాల్గొన్నారు.