హైదరాబాద్: రాష్ట్రంలో అక్కడక్కడ తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు మరో మూడు రోజుల వరకు కొనసాగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. ఉపరితల ద్రోణి ఈశాన్య మధ్యప్రదేశ్ నుండి విదర్భ మరియు మరాఠ్వాడల మీదుగా ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కిలోమీటర్ల ఎత్తు వద్ద కొనసాగుతోందని.. దీని ప్రభావంతో రాగల 3 రోజులకు వాతావరణ సూచనలు విడుదల చేసింది. రాగల మూడు రోజులు గాలి వేగం గంటకు 30 నుండి40 కి మీ వేగంతో గాలులు వీస్తాయని, అలాగే తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు మరియు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.
ఇవి కూడా చదవండి
ఉద్యోగాల నోటిఫికేషన్ పై మాణికం ఠాగూర్ ట్వీట్
అమెరికా నుంచి ఇండియన్ మ్యూజిక్
విదేశీ గల్లీల్లో మన చాట్.. మన బజ్జీ