హైదరాబాద్ ప్రాంతాల్లో రెండ్రోజులు మోస్తరు వానలు

హైదరాబాద్, వెలుగు : గ్రేటర్​పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం మోస్తరు వాన పడింది. మల్కాజిగిరి, కాప్రా ప్రాంతాల్లో గంటలో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. దీంతో పలు రోడ్లపై వర్షపు నీరు నిలిచింది. అత్యధికంగా మల్కాజగిరిలో 2.38, చర్లపల్లిలో 2.33

ఏఎస్​రావు నగర్ లో 1.90, అల్వాల్ లో 1.83, సఫిల్ గూడలో 1.65 సెంటీమీటర్ల వాన పడింది. మిగిలినచోట్ల జల్లులు కురిశాయి. శని, ఆదివారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.