కరోనా వ్యాక్సిన్ల రేసు.. ఫ్రంట్ లైన్లో మోడెర్నా, ఫైజర్
ట్రయల్స్‌లో మోడెర్నా 94.5%.. ఫైజర్ 90% సేఫ్
ఇప్పటివరకు ఏ వ్యాక్సిన్‌ను చేయని టెక్నాలజీతో తయారు
కోట్ల డోసులు కొనేందుకు ఆల్రెడీ దేశాల ఒప్పందాలు
హైదరాబాద్, వెలుగు: కరోనా వైరస్ మళ్లీ భయపెడుతోంది. ప్రపంచమంతటినీ గుప్పిట పట్టేందుకు పడగ విప్పుతోంది. అమెరికా, యూరప్‌లలో పరిస్థితి భయంకరంగా తయారవుతోంది. వైరస్ దెబ్బకు అక్కడి కొన్ని దేశాలు మళ్లీ లాక్ డౌన్ కూడా పెట్టేశాయి. ఇలాంటి టైమ్‌లో వ్యాక్సిన్ రేసులో ముందున్న చైనాలో అక్కడి వ్యాక్సిన్ బెడిసి కొట్టిందని వార్తలొచ్చాయి. ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్‌ను కూడా మధ్యలో ఆపి మళ్లీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఈ టైమ్‌లో మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు రేసులో ముందుకొచ్చాయి. 90 శాతానికి పైగా సేఫ్ అని వాటి ట్రయల్స్ రిజల్ట్స్ చెబుతున్నాయి.
ఫైజర్ 90 శాతం.. మోడెర్నా 94 శాతం
ప్రిలిమినరీ పరీక్షల్లో మోడెర్నా వ్యాక్సిన్ 94.5 శాతం ఎఫెక్టివ్‌గా పని చేసిందని తయారీ సంస్థ చెప్పింది. టీకా ద్వారా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువ టైమ్‌లోనే తగ్గిపోతాయంది. ట్రయల్స్‌లో వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లలో ఎవరికీ కరోనా తీవ్ర మవలేదని చెప్పింది. మరోవైపు ఫైజర్ వ్యాక్సిన్ కూడా 90 శాతానికి పైగా ఎఫెక్టివ్‌గా పని చేసిం దని వ్యాక్సిన్ తయారు చేస్తున్న సంస్థలు ఫైజర్, బయోఎన్‌టెక్ వారం కిందట వెల్లడించాయి.
ఇంతవరకు వాడని టెక్నాలజీతో..
మోడెర్నా, ఫైజర్ వ్యాక్సిన్లు రెండింటినీ మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ టెక్నాలజీతో డెవలప్ చేస్తున్నారు. ఈ టెక్నాలజీతో ఓ అప్రూవ్డ్ వ్యాక్సిన్‌ను ఇంతవరకూ డెవలప్ చేయలేదు. ఈ పద్ధతిలో బాడీలోని కణాలను వ్యాక్సిన్ తయారు చేసేలా మార్పు చెందిస్తారు. కరోనా స్పైక్ ప్రోటీన్స్ కాపీలను తయారు చేయాలని వ్యాక్సిన్లు కణాలకు చెబుతాయి. ప్రొటెక్టివ్ యాంటీబాడీలను చేసేలా ప్రేరేపిస్తాయి.
మోడెర్నాకు అమెరికా.. ఫైజర్‌కు జర్మనీ సపోర్ట్
అమెరికా ఆపరేషన్ వార్ప్ స్పీడ్ ప్రోగ్రామ్ ద్వారా మోడెర్నా రూ. 7 వేల కోట్లను పొందింది. ఫైజర్‌కు ఇలాంటి ఫండ్ సర్కారు నుంచి అందలేదు. అయితే బయోఎన్‌టెక్‌కు జర్మనీ నుంచి రూ. 3 వేల కోట్లకు పైగా నిధులొచ్చాయి. కాగా ఫైజర్ కంపెనీ నుంచి రూ. 15 వేల కోట్ల మేర డోసులు కొనుగోలు చేసేందుకు అమెరికా ఒప్పందం చేసుకుంది. మోడెర్నా నుంచి రూ.11 వేల కోట్ల విలువైన వ్యాక్సిన్ కొనుక్కుంటామంది.
స్టోరేజ్ కష్టమే
వ్యాక్సిన్ అప్రూవ్ అయ్యే వరకు ఉండే సమస్యలు ఓరకమైతే ఓకే అయ్యాక మొదలయ్యే ప్రాబ్లమ్స్ ఇంకోరకం. కోట్లాది మందికి అందించే వ్యాక్సిన్లను నిల్వ చేయడం, పంపిణీ చేయడం కష్టమైన వ్యవహారం. ఫైజర్ వ్యాక్సిన్‌ను వాడటానికి ముందు అల్ట్రా కూల్ ప్లేస్‌లో స్టోర్ చేయాలి. రిఫ్రిజిరేటర్లలో 5 రోజుల వరకే నిల్వ ఉంచగలము. మోడెర్నా వ్యాక్సిన్ రిఫ్రిజిరేటర్లలో 30 రోజుల వరకు ఉంటుంద ని తయారీ సంస్థ వెల్లడించింది. ఫ్రీజర్లలో ఇంకా ఎక్కువ రోజులు నిల్వ ఉంచొచ్చని, ఫైజర్‌లా స్పెషల్ సౌకర్యాలు అవసరం ఉండదని చెప్పింది.
ఇప్పటికే డీల్స్ అయిపోయినయ్
అమెరికాకు 10 కోట్ల డోసులు అమ్మేందుకు మోడెర్నా ఇప్పటికే ఒప్పందం చేసుకుంది. 8 కోట్ల డోసులను యూరోపియన్ యూనియన్, ఇతర దేశాలకు అమ్మబోతోంది. ఫైజర్, బయోఎన్‌టెక్ కూడా చాలా దేశాలతో డీల్స్ కుదుర్చుకున్నాయి.
అమెరికా ఇంకా అప్రూవ్ చేయలే
వ్యాక్సిన్లకు సంబంధించి ప్రస్తుతం ప్రాథమిక ఫలితాలే వచ్చాయి. అవి సేఫ్ అని ప్రూవ్ చేసుకోవడానికి అవసరమైన వారికి ఇవ్వడానికి గాను అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తాము త్వరలోనే రెగ్యులేటరీల నుంచి అనుమతి తీసుకుంటామని మోడెర్నా చెప్పింది. మరోవైపు ఫైజర్‌కు సంబంధించి 2 నెలల సేఫ్టీ ఫాలో అప్ డేటా నవంబర్ మూడో వారంలో రానుంది. ఈ నెలలోనే అమెరికాలో అప్రూవల్‌కు ఆ సంస్థ అప్లై చేసుకునే చాన్స్ ఉంది.
For More News..