
హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ప్రచార సభలు జనంపై ఏ మేరకు ప్రభావం చూపాయన్న దానిపై టీఆర్‌ఎస్ ఆరా తీస్తోంది. వివిధ వర్గాల నుంచి సమాచారం సేకరిస్తోంది. ఎల్ బీ స్టేడియంలో ప్రధాని ప్రచార సభకు జనం స్వచ్ఛందంగానే వచ్చారా? పాలమూరు, లష్కర్ సీట్లలో బీజేపీ ప్రభావం ఎంత? అని అంచనా వేస్తోంది. రాహుల్ మూడు ప్రచార సభల్లో పాల్గొంటే ఒక్క నల్గొండ మాత్రమే సక్సెస్ అయ్యిందని, మిగతా రెండు సభలు ఫెయిల్ అయ్యాయంటూ లెక్కలు కడుతోంది. జహీరాబాద్, వనపర్తి సభలకు పెద్దగా స్పందన లేదని అంచనాకు వచ్చిం ది. టీఆర్‌ఎస్ కు ఏమాత్రం ఇబ్బందికర పరిస్థితి ఉన్నట్టు తేలినా రానున్న రెండు మూడ్రోజుల్లో కాం గ్రెస్ నుంచి భారీ ఎత్తున చేరికలకు రంగం సిద్ధం చేస్తోంది. స్థానికంగానే చేరికలు ఉండేలా చూసుకోవాలని ముఖ్య నాయకులు సూచిస్తున్నా రు. మెదక్, జహీరాబాద్,నాగర్ కర్నూల్ ఎంపీ సీట్లలో ఎలాంటి ఇబ్బం ది ఉండబోదని భావిస్తోంది. రాహుల్ తదుపరి టూర్ లోభువనగిరి, మహబూబాబాద్, పెద్దపల్లిలో ప్రచారం ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యం లో అక్కడ అభ్యర్థుల గెలుపుకు ఎలాం టి జాగ్రత్తలు తీసుకోవాలని, అంశాల వారీగా కాం గ్రెస్ ను ఎలా కౌంటర్ చేయాలన్న దానిపై కసరత్తు చేస్తోంది.
లష్కర్ లో ఏంది పరిస్థితి?
బీజేపీకి సికింద్రాబాద్ పరిధిలో బలం ఉండటంతో టీఆర్‌ఎస్ దానిపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఎల్బీ స్టేడియంలో సీఎం కేసీఆర్ తలపెట్టిన ప్రచార సభను జనం లేక రద్దు చేసుకోవడం, అక్కడే నిర్వహించిన ప్రధాని సభకు మాత్రం జనం రావడంపై విశ్లేషణలు చేస్తోంది. మోడీ ఇప్పటికే మహబూబ్ నగర్ ఎంపీ ప్రచార సభలో పాల్గొనడంతో అక్కడ బీజేపీ ప్రభావం ఏ మేరకు ఉండవచ్చన్న దానిపై ఓ అంచనాకు వచ్చిం ది. అక్కడ రెడ్డి కులానికి చెందిన నేతలంతా బీజేపీ అభ్యర్థికి అండగా నిలవడం టీఆర్‌ఎస్ ను కాస్త ఆందోళనకు గురి చేస్తోంది. గులాబీ పార్టీ సైతం అదే కులం నేతకు టికెట్ ఇచ్చినా ఆయన నేతలతో కలుపుగోలుగా ఉండకపోవడం, ప్రజలతో మాట్లాడలేకపోవడం పార్టీకి ఇబ్బంది కలిగించే అంశాలుగా అంచనాకు వచ్చింది..