వారణాసిలో గంగా నదిపై రైలురోడ్డు బ్రిడ్జ్ : కేంద్ర కేబినెట్ ఆమోదం

వారణాసిలో గంగా నదిపై రైలురోడ్డు బ్రిడ్జ్ : కేంద్ర కేబినెట్ ఆమోదం

గంగా నదిపై రైలు, రోడ్డు వంతెన నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలోని అక్టోబర్ 16న సెంట్రల్ కాబినేట్ భేటీ అయ్యింది. ఈ సమావేశంలో గంగా నదిపై వారణాసిలో రైల్ మరియు వాహనాలు వెళ్లడానికి భారీ వంతెన ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. గంగా నదిపై కట్టబోయే బ్రిడ్జ్ ట్రాఫిక్ పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద వంతెనలో ఒకటని రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ తెలిపారు. రూ.2వేల 642 కోట్లతో పైన ఆరు లైన్ల హైవే రోడ్డు, కింద నాలుగు లైన్ల రైల్వే బ్రిడ్జ్ నిర్మించనున్నారు.

ఇప్పటికే గంగా నదిపై ఉన్న మాల్వియా బ్రిడ్జికి 137 ఏళ్లు నిండాయి. అందుకే ఇప్పుడు కొత్తగా మరో వంతెన ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ తగ్గించి వాహనాల రాకపోకలను సులభతరం చేయడానికి, రైల్వే ఖర్చులు తగ్గించడానికే ఈ ప్రాజెక్ట్ తీసుకున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి, చందౌలీ జిల్లాల గుండా వెళుతుందని మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది.