ఒకే దేశం.. ఒకే ఎన్నికలు నివేదికకు మోదీ కేబినెట్ ఆమోదం

ఒకే దేశం.. ఒకే ఎన్నికలు నివేదికకు మోదీ కేబినెట్ ఆమోదం

న్యూఢిల్లీ: ఒకే దేశం.. ఒకే ఎన్నికలు.. మోదీ చిరకాల స్వప్నం.. ఈ విధానంపై అధ్యయనం చేయటానికి నియమించిన.. మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవిద్ కమిటీ నివేదికకు.. కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించటానికి ఈ కమిటీ చేసిన సిఫార్సులను మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ప్రధాని మోడీ అధ్యక్షతన ఇవాళ (సెప్టెంబర్ 18) జరిగిన మంత్రి మండలి సమావేశంలో జమిలీ ఎన్నికల (వన్ నేషన్= వన్ ఎలక్షన్) విధానానికి సెంట్రల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభ, రాజ్య సభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపి చట్టరూపం దాలిస్తే..  దేశంలో 100 రోజుల్లోనే లోక్ సభ, అసెంబ్లీ, లోకల్ బాడీ ఎన్నికలు జరగనున్నాయి.