ఉత్తర కాశీకి రూ.5 వేల కోట్లు కేటాయించిన ప్రధాని మోదీ.. దక్షిణ కాశీ వేములవాడకు ఎందుకు రూపాయి ఇవ్వలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. మోదీ వేములవాడ పర్యటన కేవలం పొలిటికల్ టూర్ గానే మిగిలిపోయిందని... కానీ ఒక్క హామీ కూడా ఇవ్వలేదన్నారు. పదేళ్లలో ఒక్కసారి కూడా గుర్తుకురాని వేములవాడ ఎన్నికల టైమ్ లోనే మోదీకి గుర్తుకు వచ్చిందా అని పొన్నం ప్రశ్నించారు. బండి సంజయ్ తన మీద తనకు నమ్మకం లేకనే మోదీని తెప్పించావా అని ఎద్దేవా చేశారు.
తన భార్య మంగళ సూత్రం అమ్ముకుని నామినేషన్ వేసిన అని చెప్పుకునే బండి సంజయ్ కి వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని మంత్రి పొన్నం ప్రశ్నించారు. బండి సంజయ్ ఆస్తులపై విచారణ జరిపితే జైలుకు వెళ్లడం ఖాయమని చెప్పారు. బండి సంజయ్ అవినీతి చేశాడు కాబట్టే రాష్ట్ర అద్యక్షుడి పదవి నుండి తొలగించారని ఆరోపించారు పొన్నం. పదేళ్ల కేసీఆర్ ప్రభుత్వాన్ని ఎలా దింపారో...బీజెపీ ప్రభుత్వాన్ని కూడా గద్దె దింపాలని పొన్నం కోరారు.