న్యూఢిల్లీ : దేశ భద్రతపై ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ తో పాటు పలువురు సీనియర్ అధికారులు భేటీకి హాజరయ్యారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్లు సైతం సమావేశంలో పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో దేశ భద్రత, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలపై సమావేశంలో చర్చించారు.
#WATCH Prime Minister Narendra Modi chairs a high-level meeting to review India’s security preparedness and the prevailing global scenario in the context of the ongoing conflict in Ukraine pic.twitter.com/fgKK6Tc7eP
— ANI (@ANI) March 13, 2022
రష్యా, ఉక్రెయిన్ ఇరు దేశాలతో భారత్కు అవసరాలున్నాయని ప్రధాని మోడీ ఎన్నికల విజయోత్సవ కార్యక్రమంలో ప్రకటించారు. రాజకీయంగా, ఆర్థికంగా, భద్రతాపరంగా, విద్యాపరంగా భారత్ ఈ రెండు దేశాలతో సంబధాలను కలిగి ఉందనిచెప్పారు. భారత్ శాంతిని కోరుకుంటోందని, చర్చల ద్వారా రష్యా, ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గి పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుతుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు.