మోదీకుట్ర..నిజాయితీపై దాడి..బాధపడ్డాను..రాజీనామాపై కేజ్రీవాల్

మోదీకుట్ర..నిజాయితీపై దాడి..బాధపడ్డాను..రాజీనామాపై కేజ్రీవాల్

న్యూఢిల్లీ:ఇటీవల ముఖ్యమంత్రి పదవి వదులుకున్న ఆఫ్ నేత కేజ్రీవాల్ తన రాజీనామా వెనక ఉన్న అసలు విషయాన్ని బయటపెట్టారు. ప్రతిపక్షాలు,కేంద్ర దర్యాప్తు సంస్థలు చేస్తున్న అవినీతి ఆరోపణలతో బాధపడి రాజీనామా చేసినట్టు తెలిపారు. ఆదివా రం (సెప్టెంబర్22) ఢిల్లీలో జరిగిన ఓ సభలో ప్రసంగించిన కేజ్రీవాల్.. తన నిజాయితీపై ప్రధాని మోదీ దాడి చేసి ఆప్ నేతలను జైలు పంపారని అన్నారు. 

అవినీతి ఆరోపణలతో బాధపడ్డాను. అందుకే రాజీనామా చేశానన్నారు. కరెంట్, నీళ్ల సమస్య లేకుండా చేశాం..ప్రజలకు ఉచితంగా వైద్యం అందించం.. విద్యను అద్భుతంగా తీర్చిదిద్దామన్నారు కేజ్రీవాల్. ఆప్ పై విజయం సాధించాలంటే..దాడి చేయాల్సిందేనని ఆలోచించారు.. కేజ్రీవాల్, సిసోడియాను నిజాయితీ లేనివారని నిరూపించడానికి , ప్రతి నాయకుడిని జైలు పెట్టాలని మోదీ కుట్రపన్నారని చెప్పారు. 

ALS READ | బుల్లెట్కు బుల్లెట్తోనే బదులిస్తం: పాక్కు అమిత్ షా వార్నింగ్​

ఎక్సైజ్ పాలసీ కుంభకోణంకేసులో బెయిర్ పై జైలు నుంచి రెండు రోజుల తర్వాత కేజ్రీవాల్ రాజీనామా చేశారు.. తదుపరి ముఖ్యమంత్రిగా ఆతిశీ సింగ్ ను ఎన్నుకున్నారు. నవరాత్రుల ప్రారంభం తర్వాత ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేస్తానని చెప్పారు కేజ్రీవాల్.