నారాయణ్ ఖేడ్, వెలుగు: మోదీ క్రికెట్ కప్ సీజన్ 2 ఫైనల్ మ్యాచ్ ఖేడ్ పట్టణంలోని తహసిల్ గ్రౌండ్లో గురువారం జరిగింది. ఖేడ్ నియోజకవర్గం నుంచి 32 టీంలు టోర్నమెంట్లో పాల్గొనగా ఫైనల్ మ్యాచ్ బీఎస్ వీర్ శెట్టి, వినయ్ ఫ్లవర్ డెకరేషన్ టీమ్ ల మధ్య జరిగింది. ఫైనల్ మ్యాచ్లో గెలిచిన బీఎస్ వీర్ శెట్టి టీంకు రూ.55,555, రన్నర్ వినయ్ ఫ్లవర్ డెకరేషన్ టీమ్ కు రూ.25,555 ప్రైజ్ మనీతో పాటు ట్రోఫీలను బీజేపీ నాయకులు అందజేశారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి మాట్లాడుతూ యువకులు క్రీడల్లో పాల్గొనడం వల్ల ఫిజికల్ ఫిట్నెస్ సాధించడంతో పాటు మానసిక ప్రశాంతత పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు రామకృష్ణ,అరుణ్ రాజ్, నిర్వాహకులు వెంకటరెడ్డి, ప్రవీణ్, విలాస్ రావు పాల్గొన్నారు.