జో బైడెన్ దంపతులకు మోదీ అరుదైన బహుమతులు

జో బైడెన్ దంపతులకు మోదీ అరుదైన బహుమతులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులకు ప్రధాని మోదీ అరుదైన బహుమతులు ఇచ్చారు. క్వాడ్ సమ్మిట్, UNGA ప్రసంగం కోసం మోదీ 3 రోజుల US పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా డెలావేర్ లోని బైడెన్ నివాసంలో మోదీ కలిశారు. వెండితో మహారాష్ట్ర అస్తకళాకారులు తయారు చేసిన రైలు నమోనాను ఆయనకు అందించారు. జిల్ బైడెన్ కు పష్మీనా శాలువను గిఫ్ట్ గా ఇచ్చారు. 92.5 శాతం సిల్వర్ మెటల్ ను ఉపయోగించి తయారు చేసిన ట్రైన్‍పై ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఢిల్లీ టూ- డెలావేర్, ఇంజిన్‌పై ఇండియన్ రైల్వేస్ అని రాసి ఉంది. ఇది ఇండియన్ రైల్వేస్ లో కనిపించే కామన్ ఫార్మట్. ఫిలిగ్రీ వర్క్ వంటి సాంప్రదాయ పద్ధతుల ద్వారా ఆ ట్రైన్ మోడల్ డిజైన్ చేయబడింది.

జమ్మూ కాశ్మీర్ లో ప్రత్యేకంగా తయారు చేసిన శాలువను బైడెన్ భార్య జిల్ బైడెన్ కు బహుమతిగా ఇచ్చారు. లడఖ్‌లోని చాంగ్తాంగి వంటి ఎత్తైన ప్రాంతాలలో మేకల ఉన్నితో పష్మినా శాలువా తయారు చేస్తారు. దీన్ని కూడా చేతితోనే నేస్తారు. పాష్మ్ అనే మృదువైన, సున్నితమైన ఊల్ కోటును దీనితోనే తయారు చేస్తారు. మొక్కలు, ఖనిజాలు నుంచి తీసిన సహజ రంగులను మాత్రమే ఆ శాలువకు అద్దుతారు. పష్మీనా శాలువాలు జమ్మూ కాశ్మీర్ నుంచి పేపియర్-మాచే పెట్టెలలో ప్యాక్ చేసి అమ్ముతారు. వీటిని కాగితం గుజ్జు, జిగురు మరియు సహజ పదార్థాలను ఉపయోగించి చేతితో తయారు చేస్తారు. కాశ్మీర్ యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సూచించే ప్రతి పెట్టె ఒక ప్రత్యేకమైన కళాకృతి.

అమెరికా, ఇండియా దౌత్య సంబంధాలను పెంపొందించడానికి మరియు ప్రాంతీయ, ప్రపంచ వైరుధ్యాలను పరిష్కరించడానికి మోదీ, బైడెన్ లు చర్చించారు. తర్వాత అమెరికన్ టెక్ బిజినెస్ లీడర్‌లను కలవనున్నారు. అనంతరం అమెరికన్,-ఇండియన్ కమ్యూనిటీని ఉద్దేశించి న్యూయార్క్ లోని  యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ (UNGA)లో భారత ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.