మోదీ ప్రభుత్వం టెర్రరిజాన్ని సహించదు

మోదీ ప్రభుత్వం టెర్రరిజాన్ని సహించదు
  • 2026 మార్చి నాటికి నక్సలిజం అంతమవుతుంది: అమిత్ షా

న్యూఢిల్లీ: మోదీ ప్రభుత్వం టెర్రరిజాన్ని సహించదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. మార్చి 21, 2026 నాటికి దేశంలో నక్సలిజం అంతమవుతుందని పేర్కొన్నారు. హోంశాఖ పనితీరుపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా రాజ్యాంగ నిర్మాతల కలను నెరవేర్చిందన్నారు. 

జమ్మూ కాశ్మీర్‌‌లో టెర్రరిజం, వామపక్ష తీవ్రవాదం, ఈశాన్య ప్రాంతంలో తిరుగుబాటు దేశానికి అతిపెద్ద సవాళ్లుగా ఉన్నాయని అమిత్​షా అన్నారు. ‘‘వాటి వల్ల నాలుగు దశాబ్దాలలో దాదాపు 92 వేల మంది పౌరులు మరణించారు. వీటిని ఎదుర్కోవడానికి ఎటువంటి వ్యవస్థీకృత ప్రయత్నం జరగలేదు. మోదీ ప్రభుత్వం దానిని చేసింది" అని అమిత్​ షా అన్నారు.