కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్న మోదీ ప్రభుత్వం

ఆసిఫాబాద్, వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని సీపీఐ జిల్లా కార్యదర్శి బద్రి సత్యనారాయణ మండిపడ్డారు. సీపీఐ 99వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సీపీఐ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1925 డిసెంబర్ 26న కాన్పూర్​లో ఆవిర్భవించిన సీపీఐ అప్పటి  నుంచి నేటి వరకు అనేక పోరాటాలు, త్యాగాలు చేసిందని గుర్తు చేశారు. 

కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక,కర్షక వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని ఫైర్​అయ్యారు. ఆసిఫాబాద్​జిల్లా వెనుకబాటుకు ప్రధాన కారణం పాలకులేనని, ప్రభుత్వాన్ని ఇప్పటికైనా మార్పు రావాలని కోరారు. జిల్లాలో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని, కార్మికులకు, కర్షకులకు అన్ని అవకాశాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బోగె ఉపేందర్, ఆత్మకూరి చిరంజీవి, పిడుగు శంకర్, నాయకులు వికాస్,  సుధాకర్, మోహన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.