తమిళ నటుడు విజయ్కి Y కేటగిరీ భద్రత..గుర్రుమంటున్న డీఎంకే వర్గాలు

తమిళ నటుడు విజయ్కి Y కేటగిరీ భద్రత..గుర్రుమంటున్న డీఎంకే వర్గాలు

ప్రముఖ తమిళనటుడు, తమిళక వెట్రి కజగం(టీవీకే) పార్టీ వ్యవస్థాపకుడు విజయ్కి శనివారం (ఫిబ్రవరి 15) కేంద్ర ప్రభుత్వంY కేటగిరి భద్రతను కల్పించింది. ఎవరూ ఊహించని కేంద్ర హోంశాఖ నిర్ణయంతో తమిళ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చనీయాంశమైంది. 

తమిళ ప్రజలకు సుపరిచితుడు, నటుడిగా ప్రజల్లో మంచిగుర్తింపు ఉన్న విజయ్ తో  ప్రధాన ప్రతిపక్షమైన AIADMK అగ్రనాయకత్వం చర్చలు జరుపుతున్న వేళ..ఈ పరిమాణం ఆసక్తిరేపుతోంది. టీవీకే పార్టీని ఎన్డీయే కూటమిలో చేర్చుకోవాలని బీజేపీ ఎరవేస్తుందా అనే కోణంగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. 

Y కేటగిరి సెక్యూరిటీలో సాధారణంగా 8మంది  CRPF సిబ్బంది, ఇద్దరు కమాండోలు, అదనపు పోలీసు సిబ్బందితో భద్రత కల్పిస్తారు. రెండు ఎస్కార్క్ వాహనాలు ఏర్పాటు చేస్తారు.

నటుడిగా తమిళ ప్రజలనుంచి మంచి ఆదరణ ఉన్న విజయ్ లోక్ సభ ఎన్నికలకు ముందు పార్టీ పెట్టారు. 2024 ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కజగం పార్టీ టీవీకేను ప్రారంభించారు. పార్టీ తొలి సభను తమిళనాడులోని విల్లుపురంలో ఏర్పాటు చేశారు. ఈ సభకు అనూహ్య స్పందన లభించింది. 

పార్టీ ప్రారంభలో విజయ్ డీఎంకే, బీజేపీపై విమర్శలు చేశారు. డీఎంకే అవినీతి పార్టీ అని, రాచరిక పాలన అని విమర్శించారు. మరోవైపు బీజేపీ తన సైద్ధాంతిక శత్రువు అని అన్నారు. 2026 ఎన్నికల్లో డీఎంకే ను గద్దె దించడమే తన పార్టీ లక్ష్యంగా ప్రకటించారు. 

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది ఉండగా కేంద్రంలోని బీజేపీ సర్కార్.. విజయ్ కి Y కేటగిరి భద్రత కల్పించడం చర్చనీయాంశమైంది. గతవారం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో విజయ్ భేటీ కావడం అసెంబ్లీ ఎన్నికలపై చర్చలు జరుపుతుండగా.. కేంద్ర హోంశాఖ విజయ్ కి సెక్యూరిటీ పెంచడంపై అధికారపార్టీ డీఎంకే వర్గాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.