శ్రీహరికోటలో 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్..

ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోటలో ఉన్నటువంటి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌ కి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందులో భాగంగా సతీష్ ధావన్ స్పేస్ సెంట్రల్ లో మూడవ లాంచ్ ప్యాడ్ (TLP) ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశంలో భారతదేశ స్పేస్ రీసెర్చ్ డెవలప్మెంట్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది.

ఈ 3వ లాంచ్ ప్యాడ్ నిర్మాణానికి రూ.3984 కోట్లు బడ్జెట్ వెచ్చించి అంతరిక్ష నౌకల లాంచ్ కి అన్నివిధాలుగా సరిపోయే విధంగా నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 48 నెలల్లోనే ఈ లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు.

ALSO READ | చంద్రబాబుకుసుప్రీం కోర్టులో ఊరట

ఇస్రో యొక్క ప్రయోగ మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు నెక్స్ట్ జెనెరేషన్ లాంచ్ వెహికల్స్ (NGLV)కి మద్దతు ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం శ్రీహరికోటలో రెండు లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. వీటికి బ్యాకప్ గ 3వ లాంచ్ ప్యాడ్ ని ఉపయోగించనున్నారు.