
చిరువ్యాపారులకు లబ్ది,డిజిటల్ చెల్లింపుల సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం యూపీఐ ఇన్సెంటివ్ స్కీమ్ ను తీసుకొచ్చింది.. దీనికి కేంద్ర కేబిటినెట్ ఆమోదం తెలిపింది.20వేల లోపు BHIM UPI లావాదేవీలను ప్రోత్సహించేందుకు 15వేల కోట్ల ప్రోత్సాహక పథకాన్ని ఆమోదించింది. ఈ పథకం మొత్తం వ్యాపార లావాదేవీల్లో దాదాపు 55శాతం కవర్ చేస్తుంది.
చిరువ్యాపారులు నేరుగా ప్రయోజనం పొందుతారు. రూ.2వేల లోపు డిజిటల్ చెల్లింపులకు లావాదేవీ విలువలో 0.15శాతం ప్రోత్సాహకాలు అందిస్తారు. బ్యాంకులు ప్రతి త్రైమాసికంలో అంగీకరించబడిన క్లెయిమ్ మొత్తంలో 80శాతం షరతులు లేకుండా పొందేలా చేస్తుంది.మిగిలిన 20శాతం బ్యాంకు ప్రమాణాలను అనుగుణంగా తర్వాత చెల్లిస్తారు. డిజిటల్ లావాదేవీలను ఖర్చు లేకుండా చేయడం ద్వారా చిన్న వ్యాపారాలలో UPIని వినియోగించేందుకు ఈ ఫ్రేమ్‌వర్క్ రూపొందించబడింది.
పథకం లక్ష్యం
దేశవ్యాప్తంగా స్వదేశీ BHIM-UPI డిజిటల్ చెల్లింపుల బలోపేతం ఈ పథకం లక్ష్యం. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి UPI లావాదేవీ విలువను రూ. 20వేల కోట్లకు పెంచడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ప్రభుత్వం లక్ష్యం. 2020 నుంచి RuPay డెబిట్ కార్డులు ,BHIM-UPI ప్లాట్‌ఫామ్ ద్వారా నిర్వహించే లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేటు (MDR)ను మాఫీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. గత మూడేళ్లలో బ్యాంకులు, వ్యాపారులకు 7వేల కోట్ల ప్రోత్సాహకాలను అందించింది.
యూపీఐ ఇన్సెంటివ్ స్కీ్మ్ ద్వారా చిన్న వ్యాపారులు,సాధారణ ప్రజలకు కూడా అదనపు ఛార్జీలు లేకుండా సజావుగా UPI ఆధారిత చెల్లింపులకు హామీ ఇస్తుంది.చిన్న వ్యాపారులు అదనపు ఖర్చులు లేకుండా UPI సేవలను ఉపయోగించవచ్చు.