జూన్ 25ను సంవిధాన్ హత్యాదివాస్‌గా ప్రకటించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వం జూలై 12న కీలక నిర్ణయం తీసుకుంది.  జూన్ 25ను సంవిధాన్ హత్యాదివాస్ గా నిర్వహించాలని నిర్ణయించుకుంది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇంధిరా గాంధీ భారత్ లో అత్యవరసర పరిస్థితి విధించారు. ప్రతి సంవర్సతరం జూన్ 25ను సంవిధాన్ హత్యాదివాస్ గా జరపాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ప్రకటించారు. 

ఎమర్జెన్సీ టైంలో అమానవీయ భాదలు భరించిన వారందరిని గుర్తుచేసుకుంటూ అధికారికంగా సంవిధాన్ హత్యాదివాస్ నిర్వహిస్తామని శుక్రవారం ఆయన తెలిపారు. ఆరోజుల్లో జరిగిన హింసను ఎదుర్కొంటూ.. ప్రజాస్వామ్యం పరిరక్షణకు కోసం పోరాడిన లక్షలాది మంది అమరులను గౌరవించే ఉద్దేశ్యమే సంవిధాన్ హత్యాదివాస్ అన్నారు.  ప్రతి భారతీయుడిలో వ్యక్తి స్వేచ్ఛా, ప్రజాస్వామ్య రక్షణ సజీవంగా ఉంచడానికి ఈ దివాస్ ఉపయోగపడుతుందని వారు అన్నారు.