ప్రణబ్ ​ముఖర్జీ స్మారకం పక్కనే మన్మోహన్ మెమోరియల్

ప్రణబ్ ​ముఖర్జీ స్మారకం పక్కనే మన్మోహన్ మెమోరియల్

న్యూఢిల్లీ: రాజ్​ఘాట్ కాంప్లెక్స్​లో మాజీ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ స్మారకం కోసం కేటాయించిన స్థలం పక్కనే మన్మోహన్ సింగ్ మెమోరియల్​ ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ విషయాన్ని మన్మోహన్ కుటుంబానికి తెలియజేసి, వారి అంగీకారం కోరిందని అధికారవర్గాలు మంగళవారం తెలిపాయి. తర్వాతి ప్రక్రియ కోసం ట్రస్ట్​ను ఏర్పాటు చేయాలని మన్మోహన్ కుటుంబ సభ్యులను సంబంధిత మంత్రిత్వ శాఖ కోరిందని వెల్లడించాయి. వారు ట్రస్ట్ ఏర్పాటు చేయగానే మెమోరియల్ నిర్మాణం కోసం భూమి, రూ.25 లక్షలు కేంద్రం కేటాయించనుందని పేర్కొన్నాయి.