Good News : రిటైర్డ్ అగ్నివీర్ జవాన్లకు.. సాయుధ పోలీస్ బలగాల్లో 10 శాతం రిజర్వ్

ఆర్మీలో అగ్నివీర్ జవాన్లకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం..రిటైర్డ్ అగ్నివీర్ జవాన్లకు సాయుధ పోలీస్ బలగాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు ప్రకటిం చింది. దీంతోపాటు సెంట్రట్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో కూడా ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ లో కూడా మినహాయింపు ఇచ్చింది. 

2022 జూన్ 14 నుంచి అగ్నిపథ్ స్కీం ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా 17 యేళ్ల నుంచి 21 మధ్య వయసు వారిని ఆర్మీలో నాలుగు సంవ త్స రాల పాటు సేవలందించేందుకు అగ్నీవీర్ లు గా రిక్రూట్ చేస్తున్నారు. అయితే వీరిలో  25 శాతం మందిని ఎంపిక చేసుకొని 15 యేళ్ల పాటు ఆర్మీలో కొనసా గించేందుకు నిబంధన తీసుకొచ్చారు. ఆ తర్వాత అగ్నివీర్ వయో పరిమితి 23 యేళ్లకు పొడిగించారు. 

అయితే అగ్నివీర్ నియామకంపై  ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశాయి. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో ప్రతిపక్ష  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అగ్నివీర్ నియామకంపై కేంద్రాన్ని ఇరకాటంలో పెట్టారు. సైనిక నియామక పథకాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వం అగ్ని వీర్లను యూజ్ అండ్ త్రో కార్మికులుగా పరిగణి స్తుందని , వారికి షాహిద్( అమరవీరుడు ) హోదాను కూడా ఇవ్వదని అన్నారు.

దీనిపై స్పందించిన రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రతిపక్షాలు కావాలనే విమర్శిస్తున్నాయని అన్నారు. రాహుల్ గాంధీ మాట్లాడుతుండగానే జోక్యం చేసుకున్న రాజ్ నాథ్ సింగ్ .. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అగ్నివీర్ కుటుంబాలకు కోటి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. పార్లమెంట్ ను ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని అన్నారు.

అగ్నివీర్ నియామకాలపై విమర్శలు క్రమంలో కేంద్ర ప్రభుత్వం సాయుధ పోలీసు  బలగాల్లో అగ్నీవీర్లకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం గురువారం  (జూలై 11) ప్రకటన చేసింది.